calender_icon.png 16 February, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగ్యనరంలో 17, 18న బయో ఏషియా

16-02-2026 02:03:02 AM

50 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు రాక

లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న మార్పులు, పురోగతి, ఏఐ ప్రభావంపై సదస్సులో చర్చ

టెక్ బయోలో సరికొత్త ఆలోచనలకు కీలక వేదిక

ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి) : గ్లోబల్ టెక్-బయో రంగంలో తెలంగాణను పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దేందుకు బయో ఏషి యా 2026 సదస్సును ప్రజా ప్రభుత్వం ఫిబ్రవరి 17, 18 తేదీల్లో  హైదరాబాదులో నిర్వహి స్తున్నది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ రెండు రోజుల పాటు బయోఏషియా సదస్సు జరగనున్నది.

ప్రధానంగా హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ చేస్తుండగా,  సుమారు 50 దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధు లు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ సదస్సుగా బయో ఏషియా సదస్సుకి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సంయుక్తంగా ప్రారంభించనున్నారు.

‘టెక్‌బయో అన్‌లీష్డ్, ఏఐ, ఆటోమేషన్ - బయాలజీ రివల్యూషన్’ అనే థీ మ్‌పై సదస్సు జరగనున్నది. గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు రాష్ట్రాన్ని వేదిక చేసేందు కు హైదరాబాద్‌లో ప్రజాప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా బయోఏషియా సద స్సు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెంది న నిపుణులు ఈ బయో ఏషియా సదస్సులో పాల్గొననున్నారు.

లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈఓలు, ప్రతినిధులు సంబంధిత రంగాల్లో నిపుణులు, ఆవిష్కర్తలు ఈ వేదికపై జరిగే చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొ త్త  మార్పులు, పురోగతి, ఏఐ ప్రభావం ఈ సదస్సులో చర్చిస్తారు. హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇం టిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితర అంశాలను ఎజెండా అంశాలుగా ప్రతినిధులు చ ర్చించనున్నారు.

బయో రంగంలో కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల సహకారాలు, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సు ప్రధానంగా తెలంగాణకు ఉపయోగపడనుంది. బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధు నాతన చికిత్స 8విధానాలు, అత్యాధునిక వై ద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు చర్చించనున్నా రు.  కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూ ష్ గోయల్, అశ్విని వైష్ణవ్ కూడా హాజరుకానున్నారు.