15-10-2025 05:27:35 PM
మెట్ పల్లి (విజయక్రాంతి): పట్టణంలోని జువ్వాడి భవన్ లో మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు.శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత రక్షణ రంగ బలోపేతానికి కృషి చేసిన ఆధునిక పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం, ప్రదాన కార్యదర్శి తుమ్మనపెల్లి రాంప్రసాద్, కోముల సంతోష్ రెడ్డి, మాధవరెడ్డి, పుల్లూరి వెంకటేష్, బురా మహేంద్ర, షకీల్, సుంకే ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.