15-10-2025 05:25:37 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు నిర్వహించి పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంపై అన్ని మండలాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ప్రతి పశువుకు టీకా వేయాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వైద్యులు ఆయా గ్రామాల్లో పశువుల సంఖ్యలు సర్వే చేసి ప్రతి పసుపుకు టీకా అందించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి రాజేశ్వర్ సిబ్బంది ఉన్నారు.