శివాలయంలో అభిషేకం... ప్రత్యేక పూజలు...
11-11-2025 06:11 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గుడి మిట్టేపల్లి శివాలయంలో కార్తీక మాసంను పురస్కరించుకొని పూజారి పోలస అశోక్ ఆధ్వర్యంలో శివుడికి అభిషేకం.. ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పూజారి అశోక్ అసిస్టెంట్ తొడుపునూరి రాజేంద్రప్రసాద్ పెద్దఎత్తున భక్త బృందం పాల్గొన్నారు. అలాగే సుల్తానాబాద్ పట్టణంలోని దేవాలయాలతో పాటు మండలంలోని గ్రామాల్లో గల దేవాలయాల్లో కార్తీక మాసంను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు.




