calender_icon.png 11 November, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా కళాకారులపై ప్రభుత్వాలకు పట్టింపు ఏది..

11-11-2025 05:59:52 PM

- మండల కేంద్రాలలో సాంస్కృతిక ఆడిటోరియంలోనూ నిర్మించాలి

- ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి

మునుగోడు (విజయక్రాంతి): గోసి గొంగడేసి కాళ్లకు గజ్జలు కట్టి ప్రజల గోసులను గొంతెత్తి పాడే ప్రజా కళాకారులపై ప్రభుత్వాలకు పట్టింపు ఏది అని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాలను ప్రశ్నించారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ప్రజానాట్యమండలి మునుగోడు మండల మూడో మహాసభను వంటెపాక అయ్యోద అధ్యక్షతన నిర్వహించిన మహాసభకు హాజరై మాట్లాడారు. జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీకి మృతి పట్ల సంతాపం తెలిపి ఘనంగా నివాళులర్పించారు.

భూమికోసం భుక్తి కోసం వెట్టి సాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాట యోధుల పోరాట చరిత్రను ప్రజానాట్యమండలి కళ కళ కోసం కాదు, కల ప్రజల కోసం అనే నినా నినాదంతో వీధి నాటకం పోరాట ఆయుధమని నాటి స్వాతంత్ర ఉద్యమం నుండి వీర తెలంగాణ సాయుధ పోరాటం వరకు పాటని ఆయుధంగా మలుచుకొని ఉగ్గుపాలు రంగరించి ఉద్యమాల వైపు మళ్లించిన చరిత్ర ప్రజానాట్యమండలిద్దని అన్నారు. నేడు సోషల్ మీడియాలో వస్తున్న విష సంస్కృతికి ప్రభావతో యువతి యువకులు చెడు దారి పయనిస్తున్నారని వాళ్ళని చైతన్యవంతం చేయడానికి ప్రజానాట్యమండలి ముందు వరుసలో ఉందని తెలిపారు.

రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో, తిరుపతి దేవస్థానం మాదిరిగా నిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి జానపద కళాకారులకు సాంస్కృతిక కార్యక్రమాలలో అవకాశాలను కల్పించి ఆదుకోవాలని కోరారు. సఫ్ధర్ హాష్మీ అంజన్న వారసులుగా ప్రజా కళల్ని పరిరక్షించాలని గ్రామైన ప్రాంతాల్లో ప్రజా కళలని కళాకారులని ఆదరించాలని ప్రజా సంస్కృతి పరిరక్షించాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద విశ్వసంస్కృతిని ఎక్కించాలని వివిధ రూపాల్లో ప్రమాదకరంగా ముందుకు వస్తుందని దానికి ఎదురుకోవడానికి ప్రజా కళాకారులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతాంగ గిట్టుబాటు ధరకై కార్మికుల కనీస వేతనాలపై మహిళలపై జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలపై పాటల ద్వారా ఆటల ద్వారా పల్లె సుద్దుల ద్వారా ప్రజలని మేల్కొల్పుతుంది ప్రజానాట్యమండలని తెలిపారు. డిసెంబరు 6, 7 తేదీలలో ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలు మాడుగులపల్లి మండల కేంద్రంలో సంస్కృతి ఉత్సవాలు ప్రజానాట్యమండలి మహాసభలు ప్రజా కళాకారులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు,మిర్యాల భరత్ ,వేముల లింగస్వామి ,చికూరి బిక్షం ,పగిళ్ల యాదయ్య ,పగడాల సైదులు ,పొట్ట లక్ష్మయ్య ,శివ శంకర్ ఉన్నారు.