25 April, 2026 | 2:14 AM

ఆరు నెలల గర్భిణికి అబార్షన్

25-04-2026 12:00 AM

ప్రైవేట్ హాస్పిటల్ ఎదుట భర్త నిరసన

వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ భర్త దుర్గా ప్రసాద్ హాస్పిటల్ ఎదుట నిరసన

మేడిపల్లి ఏప్రిల్ 24 (విజయక్రాంతి): జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన పుట్టా దుర్గా ప్రసాద్(26), శృతి(20) దంపతులు సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శృతి 6 నెలల గర్భి ణీ. అయితే ఈ వివాహానికి శృతి తల్లి అంగీకరించకపోవడంతో ఈ నెల 16న శృతి తన తల్లి వద్దకు బోడుప్పల్‌కు వెళ్లింది. శృతి తన భర్తతో ఉండకూడదని భావించిన తల్లి, గర్భాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఆమెను ప్రైవేట్  హాస్పి టల్‌కు తీసుకొచ్చింది.

ఈ సమయంలో భర్త అనుమతి లేకుండా సరైన కౌన్సిలింగ్ లేకుం డా వైద్యులు గర్భస్రావానికి సంబంధించిన మందులు ఇచ్చారని దుర్గా ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్ మేడిపల్లి పోలీసుల సహాయంతో ఈ నెల 20న హాస్పిటల్‌కు చేరుకున్నాడు. పోలీసుల రాకతో హాస్పిటల్  సిబ్బంది శృతిని భర్తతో పంపించినప్పటికీ, అప్పటికే ఆమెకు మందులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

తర్వాత ఈ నెల 23న శృతి గర్భస్థ శిశువు మృతి చెందిందని, దీనికి పూర్తిగా అత్త, హాస్పిటల్ యా జమాన్యమే కారణమని ఆరోపిస్తూ దుర్గా ప్రసాద్ హాస్పిటల్ ఎదుట నిరసన చేపట్టాడు. తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరాడు. అదేవిధంగా భర్త అనుమతి లేక అబార్షన్ చేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు.