బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుడు గోపాలరావు మృతి
సంతాపం ప్రకటించిన బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు
హైదరాబాద్, ఏప్రిల్ 24(విజయక్రాంతి): హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థా పకుడు ఎస్.గోపాలరావు(90) గురువారం అనారోగ్య కారణాలతో కొండాపూర్‌లోని తన కుమారుడి నివాస గృహంలో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని తన గృహం లో మిత్రుల సందర్శనార్థం ఉంచి, అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సోము గోపాల రావు 1986లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరు. తొలి పుస్తక ప్రదర్శనకు సమన్వయకర్తగా వ్యవహరించారు.సైంటిఫిక్ సర్వీసెస్ అనే సం స్థ ద్వారా వారు పుస్తక రం గానికి సేవలు అందించారు. అనేక పుస్త క ప్రదర్శనల నిర్వహణలో వారి పాత్ర ఉంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు డా. కవియాకూబ్, ఉపాధ్యక్షుడు మలుపు బాల్ రెడ్డి, బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్. వాసు, కోశాధికారి నారాయణరెడ్డి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు.






