25 April, 2026 | 2:14 AM

రవీంద్రభారతిలో ప్రతిభ రత్న అవార్డుల ప్రదానం

25-04-2026 12:00 AM

సత్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

నాగోల్, ఏప్రిల్ 24 (నగర నిజం): హైదరాబాద్లోని రవీంద్రభారతి మినీ ఆడిటోరి యంలో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ప్రతి భ రత్న అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో సామాజిక సేవ లు అందిస్తున్న 60 మందికి పైగా ప్రముఖులను ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐవీఎఫ్ జాతీయ సీనియర్ వర్కిం గ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అవార్డులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సమాజ సేవ చేస్తున్న వారిని గుర్తించి సత్కరించడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ చైర్మన్ కొంపల్లి సత్యనారాయణ, నేషనల్ ఇన్చార్జ్ బీరెల్లి చంద్రశేఖర్ గుప్తల సేవలను ఆయన ప్రశంసించారు.

కార్యక్రమంలో హ్యూ మన్ రైట్స్ ప్రొటెక్షన్ సర్వీస్ సభ్యులు, ఐవీఎఫ్ ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కట్ట రవికుమార్, మహిళా విభా గం రాష్ట్ర అధ్యక్షురాలు లంకలపల్లి మంజుల, సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తదితరులు పాల్గొన్నారు.