24-12-2025 12:54:14 AM
కాకతీయ యూనివర్సిటీ, డిసెంబర్ 23 (విజయక్రాంతి): బంగ్లాదేశ్ లో హిందువుల పై జరుగుతున్న మారణకాండకు నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో కే యూ క్రాస్ వద్ద మానవహారం నిర్వహించి, బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులకు రక్షణ లే దని, ఆ దేశంలో హిందువులపై జరుగుతున్న మారణకాండను ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
బం గ్లాదేశ్ లోనీ హిందువులు ఒంటరివాళ్లు కాదని వారికి భారత్ లో ఉన్న 100 కోట్ల హిందువులు అండగా ఉంటారన్నారు. బంగ్లాదేశ్ హిందువుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా అందరిని ఏకం చేస్తుందన్నారు. హిందువులపై దహనకాండను ఆపకపోతే బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనిస్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
జాతీయ కార్యదర్శి శ్రావణ్ బి. రాజ్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఏర్పాటు భారత్ వల్లే సాధ్యం అయిందని, హిందువులపై దాడులు ఆపకపోతే బంగ్లాదేశ్ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి నాయకులు బాలకృష్ణ, శివకుమార్, విష్ణు వర్ధన్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జానారెడ్డి ,సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు మడూరి సం దీప్ కుమార్, నీతూ సింగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు జీవన్,ఆకాష్ బాటి, కాకతీయ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు హరిక్రిష్ణ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.