calender_icon.png 24 December, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల్య వివాహ నిషేధిత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

24-12-2025 12:55:31 AM

చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్

వెంకటాపూర్, డిసెంబర్23,(విజయక్రాంతి):సమాజంలోని ప్రతి ఒక్కరు ముఖ్యంగా విద్యార్థులు, తల్లిదండ్రులు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్ అన్నారు. మంగళవారం జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు, ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్ వివాహ్ ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ.. బాల్య వివాహ నిషేధిత చట్టం, పోక్సో చట్టం, విద్య హక్కు చట్టం, ర్యాగింగ్ చట్టం, మోటార్ వెహికల్ చట్టం వంటి కీలక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయని, చట్టరీత్యా ఇవి నేరమని స్పష్టం చేశారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిసిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, అలాగే ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 15100 కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు రాధిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.