24-12-2025 12:52:59 AM
హనుమకొండ టౌన్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): వడ్డేపల్లి 60వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏనుకొంటి పున్నం చందర్ బర్త్ డే వేడుకలు మాజీ కార్పొరేటర్ ఏనుకొంటి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ముందుగా సాలువాతో సన్మానించి, కేక్ కట్ చేపించిన డివిజన్ ముఖ్య నాయకులు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ముఖ్య నాయకులు మండల సమ్మయ్య, తాళ్లపల్లి సుధాకర్, జనగాం శ్రీనివాస్ గౌడ్, బుస్సా నవీన్ కుమార్, మట్టపల్లి కమల్ కుమార్, పిట్టల వంశీ, మిడిదొడ్డి శేఖర్, పిట్టల శేషు, ఎం డి అక్మల్, ఎం.డి సాజిద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.