27 June, 2026 | 3:07 AM

వేములవాడలో ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

27-06-2026 01:51 AM

ముఖ్య అతిథిగా హాజరైన ఏనుగు మనోహర్ రెడ్డి

వేములవాడ, జూన్ 26 (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ వీధిలో ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పెద్దమ్మ దుర్గమ్మ తల్లి బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతానని పేర్కొన్నారు.అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు, నిర్వాహకులు ఏనుగు మనోహర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి. జ్ఞాపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బాధారవేణి రాజయ్య, పండగ రాజు, లాల శ్రీకాంత్, మామిండ్ల రాములు, కే. హన్మాండ్లు, సత్తయ్య, గికూరి శ్రీనివాస్, కిసారి శ్రీనివాస్, రాంస్వామి, కనకయ్య, గుడిసె దేవరాజ్, మారం సతీష్, విజయ్, ముదిరాజ్ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.