calender_icon.png 4 July, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టపడితేనే ఫలితం..!

04-07-2025 12:43:15 AM

ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి.

 నాగర్‌కర్నూల్ జూలై 3 ( విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, గత పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సైతం కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ అ న్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని  ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు.

దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన వృత్తి రాజకీయమేనన్నారు. కాంగ్రెస్ పార్టీలో నచ్చని వ్యక్తులపై ఫిర్యాదులు చేసుకునే స్వేచ్ఛ స్వాతంత్రం కలిగి ఉండి ఇంటర్నల్ డెమోక్రసీ గా పేరు తెచ్చుకుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాంగ్రెస్ పా ర్టీ యువజన సంఘం నేతలు కష్టపడితేనే వారికి పదవుల రూపంలో ప్రతిఫలం దక్కుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సుమారు 50% యువతకే ప్రాధాన్యత లభిస్తుందని వారు నిర్ణయించిన వ్యక్తులకే టికెట్లు కూడా ఇచ్చే అవకాశం ఉందన్నారు.

సెలెక్ట్ ఎలక్ట్ పూర్తి బాధ్యత యువతకే లభిస్తుందన్నారు. గల్లీలో పార్టీ గట్టిపడితేనే ఢిల్లీలో గట్టిపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ వల్లే తాను గెలిచినట్లు గుర్తు చేశారు. సోషల్ మీడియా వారియర్లుగా యువజన కాంగ్రెస్ లీడర్లు ఎదగాలని అందుకు తన సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. మిడిమిడి జ్ఞానంతో కొందరు తప్పుడు రాతలు రాస్తూ కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కోడిదల రాము, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మాజీ కౌన్సిలర్లుఉన్నారు.