30 June, 2026 | 4:08 PM

గొర్రెల స్కాం నిందితులకు ముగిసిన ఏసీబీ కస్టడీ

13-06-2024 01:27 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): గొర్రెల పథకం గోల్‌మాల్ నిందితుల ఏసీబీ కస్టడీ బుధవారం ముగిసింది. కస్టడి గడువు ముగిసిన వెంటనే ఏసీబీ అధికారులు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆదేశాల మేరకు పశుసంవర్ధక శాఖ మాజీ అధికారి రాంచందర్‌నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ ఇద్దరు నిందుతులను ముడు రోజుల కిందట ఏసీబీ కస్టడీకి తీసుకున్న సంగతి విధితమే. మూడు రోజుల కస్టడీలో గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమా లతోపాటు ఇందులో భాగస్వామ్యం ఉన్న ఇతర అధికారులు, నాయకుల గురించి ఏసీబీ అధికారులు ప్రధానంగా ఆరా తీసినట్టు తెలిసింది.