30 June, 2026 | 5:10 PM

‘నీలమ్మ పెళ్లి పందిరి’కి నంది అవార్డు

13-06-2024 01:24 AM

చొప్పదండి, జూన్12: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూర్గుపల్లికి చెందిన ముంజ శ్రీనివాస్‌గౌడ్ నిర్వహిస్తున్న గౌడ వివాహ పరిచయ వేదిక ‘నీలమ్మ పెళ్లి పందిరి’కి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అందజేసే నంది అవార్డు దక్కింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శ్రీనివాస్‌గౌడ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక వివాహాలు జరిపించిన జాబితాలో నీలమ్మ పెళ్లి పందిరి అగ్రభాగాన ఉన్నది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, సినీ నటుడు సుమన్, గౌడ హాస్టల్ మాజీ అధ్యక్షుడు పల్లె లక్ష్యణ్‌గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు.