30 June, 2026 | 3:14 PM

దోస్త్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు

13-06-2024 01:28 AM

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ కౌన్సెలింగ్ గడువును పొడిగించారు. దోస్త్ ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందినవారు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు గడువు పెంచారు. రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు కూడా గడువు పొడిగించారు. తొలి విడత సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జూన్ 12 నుంచి 15వ తేదీ వరకు, రెండో విడత రిజిస్ట్రేషన్ గడువును జూన్ 13 నుంచి 15వ తేదీ వరకు పొడిగించారు. దోస్త్ ఫేజ్‌\ -2 వెబ్ ఆప్షన్ల నమోదు గడువు జూన్ 14 నుంచి 15కు పెంచినట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.