8 April, 2026 | 3:32 AM

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు

08-04-2026 01:41 AM

మూసేసిన దస్తావేజు లేఖర్ల షాపులు

మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా రిజి స్ట్రార్ కార్యాలయంలో మంగళవారం మళ్లీ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. ఏజెంట్ల ద్వారా సబ్ రిజిస్ట్రార్లు ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన సంఘటనపై విచారణకు రాగా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఉన్న దస్తావేజు లేఖరుల షాపులన్నీ మూసేశారు.

సబ్ రిజిస్ట్రార్లకు అనుసంధానంగా వ్యవహరిస్తూ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్లను లంచాల కోసం తొక్కి పెట్టిన సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించడానికి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించడానికి వచ్చి నట్లు ప్రచారం సాగింది.సబ్ రిజిస్ట్రార్లకు డబ్బులు అందించే కీలకమైన వ్యక్తి ఎవరనే విషయంపై ఆరా తీసినట్లు ప్రచారం సాగుతోంది. ఏసీబీ అధికారుల రాక విషయాన్ని ముందే పసిగట్టి దస్తావేజు లేఖర్లు షాపులు మూసేసినట్లు ప్రచారం సాగుతోంది.