calender_icon.png 15 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు

15-11-2025 02:05:38 AM

  1. డాక్యుమెంట్లు, పత్రాలు పరిశీలించిన అధికారులు
  2. పలుచోట్ల నగదు స్వాధీనం

మంచిర్యాల/మేడ్చల్ అర్బన్/జహీరాబాద్/మిర్యాలగూడ, నవంబర్ 14 (విజయ క్రాంతి): రాష్ట్రంలోని మంచిర్యాల, మేడ్చల్, శామీర్‌పేట్, జహీరాబాద్, మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లోని రిజిస్టర్లను,  డాక్యుమెంట్లు, పత్రాలను పరిశీలించారు. అలాగే కార్యాలయాల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్లను సైతం విచారించారు.

మంచిర్యాల కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ ప్రియాంకతో పాటు సిబ్బందిని వివరాలు అడిగితెలుసుకున్నారు. మేడ్చల్, శామీర్‌పేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీపీ డీఎస్పీ గంగాసాని శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు.  మేడ్చల్ కార్యాలయంలో చేపట్టిన తనిఖీల్లో అధికారుల వద్ద ఎలాంటి అక్రమ అవినీతికి పాల్పడిన డబ్బులు లభించలేదని తెలిపారు. కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ రేణుకతో పాటు సిబ్బంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.

అలాగే జహీరాబాద్‌లోని సబ్ రిజిస్టర్ కా ర్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారి సుదర్శన్ మీడియాతో మాట్లాడుతూ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తా ము ఆకస్మిక తనిఖీలు చేపట్టామని, ఈ సమయంలో పది మంది ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులను ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ పరంజ్యోతి వారికి సహకరిస్తున్నారని, వీరి నుంచి రూ.42,300  నగదు స్వాధీనం చేసుకొని సీజ్ చేశామన్నా రు.

అలాగే సుమారు 113 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు ఇవ్వలేదని, వాటి పైన కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నట్లు పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. కాగా మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ శుక్రవారం ఏసీబీ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో రూ. 63,160 నగదు లభ్యం కాగా తనిఖీలు కొనసాగుతున్నాయి.

ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. తనిఖీల్లో సబ్ రిజి స్టార్ కార్యాలయంలో రోజుకు 500ల చొ ప్పున చెల్లిస్తూ ఓ ప్రైవేట్ మహిళని నియమించి డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అవినీతికి పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. తనిఖీల సమయంలో కార్యాల యంలో 12 మంది డాక్యుమెంట్ రైటర్లు, 6 గురు సహాయక సిబ్బంది ఉండటాన్ని గుర్తించామ న్నారు. నిబంధనల మేరకు ఇతరులు కార్యాలయంలోకి రాకూడదని అన్నారు. ఆయన వెంట సిఐలు వెంకటరావు, కిషన్ తదితరులు ఉన్నారు.