08-02-2025 12:00:00 AM
ఢిల్లీలో బీజేపీ వర్సెస్ ఆప్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తూ వారికి ఎరవేస్తోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై విచారణ జరపాలని ఏ సీబీని ఎల్జీ ఆదేశించారు.
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఫిరోజ్‌షా రోడ్డులో ఉన్న కేజ్రీవాల్ ఇంటికెళ్లి నోటీసులిచ్చింది. ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో హైడ్రామా నడి చింది.
ఏసీబీ అధికారులను ఆప్ నేతలు లో పలికెళ్లనీయలేదు. బీజేపీతో కలిసి ఎల్జీ డ్రా మాలు ఆడుతున్నారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫలితాలకు కొద్ది గంటల ముందు ఈ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.