08-02-2025 12:00:00 AM
వివరాలు వెల్లడించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటన ఖరారైంది. 10 నుంచి 12వ తేదీ వరకూ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. అలాగే 12 తేదీల్లో అమెరికాలో పర్యటించున్నట్టు విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
ప్రధాని 10న ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లి.. అక్కడ జరిగే ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి అధ్యక్షత వహించనున్నట్టు మిస్రీ తెలిపారు.
ఆ తర్వాత కెడారచీ థర్మో న్యూక్లియర్ ఎకస్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను ప్రధాని పరిశీలిస్తారని పేర్కొన్నారు. 13వ తేదీన అమె రి కా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని సమావేశం కానున్నట్టు వెల్లడించారు.