calender_icon.png 12 September, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు

08-02-2025 12:00:00 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: హైవోల్టేజ్ నడుమ ఢిల్లీ అసెంబ్లీకి 5వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఫలితాల విడుదల నేపథ్యంలో ఈసీ తగిన ఏ ర్పాట్లు చేసింది. 70 స్థానాలున్న ఢిల్లీలో అధికారం దక్కించుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 36గా ఉంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీదే అధికారం అని తేల్చి చెప్పగా..

తమ సత్తా ఏంటో ఫలితాల రోజు తెలుస్తుందని ఆప్ చెబుతోంది. 60.42 శాతం ఓటింగ్ నమోదైంది. ఉదయం ఏడు గంటల నుంచి కౌం టింగ్ ప్రక్రియ మొదలవనుంది. కౌంటింగ్ సెంటర్ల వద్ద భద్రత కోసం 10వేల మంది పోలీసులు, 38 కంపెనీలకు చెందిన పారామిలటరీ బలగాలను ఈసీ మోహరించింది.