30 August, 2026 | 10:38 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు

11-06-2025 09:20 AM

హైదరాబాద్:  తెలంగాణలో ఏసీబీ సోదాలు(ACB searches) కొనసాగుతున్నాయి. నీటిపారుదలశాఖ ఈఈ నూనె శ్రీధర్ నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్(Irrigation Department Executive Engineer Noone Sridhar) ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణలో నూనె శ్రీధర్ కు సంబంధించి ఏకకాలంలో 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాలో ఏసీబీ దాడులు చేస్తోంది. ఎస్సారెస్పీ డివిజన్-8లో శ్రీధర్ ఈఈగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నూనె శ్రీధర్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Project) 6,7,8 ప్యాకేజీల పనులను శ్రీధర్ పర్యవేక్షించారు. ఈఈగా ఉన్న ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇరిగేషన్ శాఖలో ప్రాజెక్టులు కట్టబెట్టి వందల కోట్లు సంపాదించారన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు. శ్రీధర్( Noone Sridhar) పై ఆదాయానికి మించిన ఆస్తుల గుర్తించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కరీంనగర్ లో శ్రీధర్ ను అదుపులో తీసుకున్న ఏసీబీ అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు.