04-12-2025 12:40:26 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్(Assistant Director of Land Records) శ్రీనివాసులు నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. శ్రీనివాసులు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఆయన నివాసంతో పాటు మొత్తం ఆరు చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏడీ శ్రీనివాసులు సోదరుడు, బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ దాడులు చేస్తోంది. మహబూబ్ నగర్, బాలానగర్ ప్రాంతాల్లోనూ ఏసీబీ సోదాలు(Anti-Corruption Bureau) నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో శ్రీనివాస్ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. శ్రీనివాస్ పలుచోట్ల షెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు ఏసీబీ భావిస్తోంది. శ్రీనివాస్ కు సంబంధించి మహబూబ్ నగర్ లో రైల్ మిల్లు ఉన్నట్లు గుర్తించారు.