14 August, 2026 | 2:27 AM

వరిసాగు చేసి నష్టపోవద్దు

14-08-2026 01:15 AM

ఆరుతడి, ఉద్యాన పంటలు సాగు మేలు

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

నల్లగొండ టౌన్, ఆగస్టు 13: వానాకాలం సీజన్ ముగిసినందున జిల్లాలోని రైతు లు ఎట్టి పరిస్థితులలో వరి సాగు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. వరి వేస్తే నష్టపోవాల్సి వస్తుందన్నారు. గురువారం తిప్పర్తి మండల కేంద్రం శివారులో వరి సాగుకు భూములు సిద్ధం చేసుకుంటున్న రైతులు మోహన్, పరశురాం, ఖాదర్ తదితరులతో కలెక్టర్ మాట్లాడారు.

వరి సాగుకు సాగునీటి అవకాశాలే లేవని, వరి సాగు చేస్తే నష్టపోతారని తెలిపారు. ఆరుతడి పంటలు ఉద్యాన పంటలు వేసుకుంటే నష్టం లేకుండా ఆదాయం వస్తుంద న్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు కురిసే అవకాశం లేదని , వచ్చే ఖరీఫ్ వరకు వర్షాలు ఉండవన్నారు. శ్రీశై లం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుండి సా గునీరు వచ్చే అవకాశం లేదన్నారు. వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల నుండి నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు తగ్గిందని వివరించారు.

వరి పంట వేస్తే మధ్యలోనే ఎండిపోతుందని, పెట్టిన పెట్టుబడి కూడా గిట్టుబాటు కాదన్నారు. సెప్టెంబర్ చివరివరకు ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉందని తెలిపారు.చౌడు భూముల్లో మినుము, పెసర వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. మినుము, పెసరకు పెట్టుబడి తక్కువని, ఎకరాకు రూ.8 వేల చొప్పున ఆదాయం వస్తుందని చెప్పారు. చౌడు భూముల్లో జిప్సం వేస్తే మినుము, పెసర సులభంగా వస్తాయని, రేగు, కూరగాయలు, ఉద్యాన పంటలు కూడా వేసుకోవచ్చని అన్నారు.వ్యవసాయ అధికారులు ప్రతి రైతును కలిసి వరి సాగు వల్ల కలిగే నష్టాలను లెక్కలతో సహా వివరించాలని ఆదేశించారు.

యూరియా పంపిణీపై ఆదేశాలు 

రైతులు యూరియా కొరత గురించి ఫిర్యాదు చేయగా, అన్ని షాపుల్లో యూరి యా అందుబాటులో ఉండేలా ఇండెంట్ పంపాలని జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు విజయేందర్ రెడ్డి, ఏవో సన్నీ రాజ్, గిరిరాజు, శ్రీనివాస్, ఏఈఓ సంతోషి తదితరులు పాల్గొన్నారు.