23-10-2024 12:03:22 AM
శేరిలింగంపల్లి, అక్టోబర్ 22: ప్రమాదవశాత్తు జారిపడి యువకుడు మృతిచెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏపీలోని తెనాలికి చెందిన ఉదయ్(23) కుటుంబ సభ్యులతో కలిసి రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఆదివారం తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు చందానగర్‌లోని వీవీ ప్రైడ్ హోటల్‌లో రూమ్ తీసుకున్నారు.
మూడో అంతస్తుకు చేరుకోగానే బాల్కనీలో అకస్మాత్తుగా ఓ కుక్క ఉదయ్‌కి ఎదురుపడింది. దాన్ని తరిమికొట్టే క్రమం లో ప్రమాదవశాత్తు హోటల్ కిటికీలో నుంచి కిందకి జారిపడ్డాడు. ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగినా బయటపడకుండా హోటల్ సిబ్బంది జాగ్రత్తపడ్డారు.