13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం..

13-01-2026 01:38 PM

రోడ్డు భద్రత వారోత్సవాల్లో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్

విజయక్రాంతి,పాపన్నపేట: రహదారిపై ప్రయాణం చేసే సమయంలో రోడ్డు నిబంధనలను పాటిస్తే ప్రమాదాలను అరికట్ట వచ్చని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రం పాపన్నపేట గ్రామపంచాయతీ వద్ద మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

రోడ్డు భద్రత వారోత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణ పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. బైక్ పై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలను నడపరాదని సూచించారు. ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపితే ప్రమాదాలకు గురవుతారని దానివల్ల కుటుంబం రోడ్డున పడుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు నరేందర్ గౌడ్, కిష్టయ్య, శివయ్య, ఉప సర్పంచ్ సద్దాం హుస్సేన్, వార్డు సభ్యులు, పోలీసు, హెల్త్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి నయీమ్ తదితరులు పాల్గొన్నారు.