calender_icon.png 13 January, 2026 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ రెండు కేసులపై సజ్జనార్‌ నేతృత్వంలో సిట్

13-01-2026 01:37:00 PM

సీఎం ఫొటోలు అసభ్యకరం.. కావాలి వెంకటేశ్ పై కేసు

హైదరాబాద్: హైదరాబాద్ సీసీఎస్, నారాయణపేట జిల్లా మద్దూరులో నమోదైన కేసుల్లో సిట్ బృందం ఏర్పడింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఎనిమిది మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోలు అసభ్యకరంగా పోస్టు చేసినందుకు కావలి వెంకటేశ్ పై కేసు నమోదు చేశారు. కావలి వెంకటేశ్ తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సప్ గ్రూప్ లో పోస్టు చేశారు. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఫిర్యాదుపై ఈ నెల 11న కేసు నమోదు చేశారు. తాజాగా మహిళా ఐఏఎస్ ను కించపరిచే వార్తలపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 2 తెలుగు న్యూస్ ఛానెళ్లతో పాటు 7 యూట్యూబ్ ఛానెళ్లపై బీఎన్ఎస్ 75,78,79, 351(1), 352(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు రెండు కేసుల వ్యవహారంపై సిట్ అధికారులు దర్యాప్తు చేయనున్నారు.

సజ్జనార్ నేతృత్వంలో సిట్ టీమ్ ఇదే...

నార్త్ రేంజ్ జాయింట్ సీపీ శ్వేత.

చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్.

హైదరాబాద్ అడ్మిషన్ డీసీపీ వెంకటలక్మి.

సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు.

విజిలెన్స్ అదనపు ఎస్పీ ప్రతాప్.

సీసీఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర.

సైబర్ సెల్ సీఐ శంకర్ రెడ్డి.

కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్ఐ హరీశ్.