calender_icon.png 13 January, 2026 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం: ఇఎల్వి భాస్కర్

13-01-2026 01:40:46 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి ఉపాధి అవకాశాలను వెతికి ప్రయోజకులు కావాలని వారికి తన సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని ఇ ఎల్ వి ఫౌండేషన్ చైర్మెన్ భాస్కర్ అన్నారు.సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేలు గ్రామంలోని మూడు  చెరువులలో లక్ష చేప పిల్లలను వదిలారు.సర్వేలు గ్రామ సర్పంచ్ చిలకరాజు చందన రాజు కోరిక మేరకు హామీ ఇచ్చిన మూడు రోజులలోనే భీమవరం నుండి చేప పిల్లలను తెప్పించడం జరిగిందని భాస్కర్ అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెరువులన్నింటిలో వచ్చే సంవత్సరం చేప పిల్లల పెంపకం చేపట్టబోతున్నామని యువతకు ఉపాధి కల్పించడమే ఇఎల్వి ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుకరాజు చందన రాజు,ఉప సర్పంచ్ కట్కూరి భాస్కర్,వార్డు సభ్యులు బోయ చందు, ఈసం గీత రామకృష్ణ,శివశంకర్,నరసింహ,గ్రామ ప్రజలు,యువత అధికసంఖ్యలో పాల్గొన్నారు.