22 July, 2026 | 2:14 AM

చోరీ కేసులో నిందితుడు అరెస్ట్

22-07-2026 01:40 AM

రిమాండ్‌కు తరలింపు : ఇన్‌స్పెక్టర్ భానుప్రకాష్

ఖమ్మం, జులై 21(విజయక్రాంతి): నిందితుడు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసి ఉన్న ఇళ్లను ముందుగానే గుర్తించి, వాటి లొకేషన్ను తన సెల్ఫోన్లో సేవ్ చేసుకొని, రాత్రి సమయంలో రుద్రంకోట లోని  ఓ ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు ఇతర విలువైన వస్తువులను చోరీ చేసిన కేసులో నిందితుడు లంజపల్లి శేఖర్ @ టోనీ (31), ఆటో డ్రైవర్, నివాసం చర్చి కాంపౌండ్, ఖమ్మం, స్వస్థలం ముత్తారం గ్రామం, ముదిగొండ మండలం ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ తెలిపారు.

దొంగతనాలకు ఉపయెగించే 04 యూఏ 6914 నంబరు గల బజాజ్ డీజిల్ ఆటోను, 31.263 గ్రాముల బంగారు స్వాతిహారం, 9.530 గ్రాముల బంగారు జూకాలు, మాటీలు, ఒక మోటరోలా ఆండ్రాయిడ్ సెల్ఫోన్, ఒక వివో సెల్ఫోన్, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నిందితుడు గతంలో ఖమ్మం అర్బన్, కొనిజర్ల, చింతకాని, రఘునాథపాలెం తదితర ప్రాంతాల్లో జరిగిన పలు ఇంటి దొంగతనాలు మరియు గొలుసు లాక్కెళ్లిన కేసుల్లో కూడా తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించాడని,నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం 2వ జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరచడం జరిగినదని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లను విడిచి బయటకు వెళ్లే సమయంలో తలుపులకు నాణ్యమైన తాళాలు  వేయడం, సమీప బంధువులు లేదా పొరుగువారికి సమాచారం ఇవ్వడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.