15 April, 2026 | 7:21 AM

గంజాయి కేసులో నిందితుడికి 20 ఏంళ్ల జైలుశిక్ష, రూ.-2 లక్షల జరిమానా

30-12-2025 01:25 AM

ఖమ్మం టౌన్, డిసెంబర్ 29 (విజయ క్రాంతి): గంజాయి కేసులో నిందుతుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, 2లక్షల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం 2020 ఏడాది అక్టోబర్ 8 న కొణిజర్ల పోలీసులు ఆధ్వర్యంలో తనికెళ్ళ గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించిన ఇన్నోవా కారు ను తనిఖీ చేయగా 19లక్షల విలువ గల 130 కేజీల గంజాయిని గుర్తించారు.

నిందుతుడుని అదుపులో తీసుకునే విచారించగా అక్రమార్జన కోసం చింతూరు నుండి జాహిరాబాద్ కు గంజాయి సరఫరా చేస్తునట్లు విచారణ వెళ్లడైంది. నిందితుడు సంగారెడ్డి జిల్లా మనియార్ గ్రామానికి చెందిన కేతావత్ ప్రవీణ్ కుమార్ (25)గా గుర్తించి కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో ఎన్ డి పి ఎస్, 1985 చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు అనంతరం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.