15 April, 2026 | 8:52 AM

వెలుగు వచ్చేసింది

30-12-2025 01:27 AM
  1. విద్యుత్ కాంతులో గట్లమల్యాల

సుమారు 150 వీధి దీపాల ఏర్పాటు

విజయక్రాంతి వరుస కథనాలు 

నంగునూరు, డిసెంబర్ 29: సంవత్సరం కాలం పైగా చీకటిలో మగ్గుతున్న సిద్దిపేట జి ల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రా మం ఇప్పుడు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. నాడు ’విజయక్రాంతి’ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించిన కొత్త పాలకవర్గం, ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానా న్ని నిలబెట్టుకుంది.

గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్, ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్, వార్డు సభ్యులు ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామం లో సుమారు 150 వీధి లైట్లను ఏర్పాటు చే యించారు. దీంతో ఏళ్ల నాటి చీకటి సమస్య తొలగిపోవడంతో గ్రామస్తులు హర్షం వ్య క్తం చేస్తున్నారు. సమస్యను ప్రచురించిన వి జయక్రాంతినీ, పరిష్కరించిన ప్రజాప్రతినిధులకు, ప్రజలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.