calender_icon.png 2 May, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచర్లగూడెం వాసికి స్టేట్ రెండో ర్యాంక్

24-04-2025 01:15:20 AM

చిలుకూరు, ఏప్రిల్ 23: చిలుకూరు మండలంలోని ఆచర్లగూడెం గ్రామానికి చెందిన, బేరి, శ్రీ చరణ్ ఇంటర్మీడియట్  మొదటి సంవత్సరంలో మంగళవారం వెలువడిన ఫలితాలలో  ద్వితీయ స్థానాన్ని సాధించినాడు, అతని తండ్రి బేరి,రమేష్,ఓ సాధన ట్రాక్టర్ డ్రైవర్, తల్లి వ్యవసాయ కూలీ, తల్లి,తండ్రి, కష్టాన్ని చూసి చదివి మంచి మార్కులు సాధించానని అతను తెలిపాడు,

రాష్ట్రస్థాయిలో తమ కుమారుడు ఉత్తమ ఫలితాన్ని సాధించడంతో కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తమ గ్రామ వాసికి రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించడంతో  గ్రామస్తులు పలువురు అతనికి అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు.