24-04-2025 01:14:31 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా బండెనక బండి కట్టి వరంగల్ సభకు వెళ్తున్న అన్నదాతలకు సలాం అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేట రైతులు చూపిన ఈ చైతన్యం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ లక్షలాది రైతన్నలే రేపు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే రథ సారథులని చెప్పారు.
సివిల్స్‌లో సత్తా చాటిన తెలంగాణ తేజాలకు శుభాకాంక్షలు
సివిల్స్ పరీక్షల్లో 11వ ర్యాంకు సాధించిన వరంగల్‌కు చెందిన ఎట్టబోయిన సాయి శివానీకి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆమె గెలుపు యావత్ తెలంగాణకే గర్వకారణమన్నారు. 46వ ర్యాంకు సాధించిన రావుల జయసింహారెడ్డికి, 62వ ర్యాంకు సాధించిన శ్రావణ్ కుమార్‌రెడ్డికి, 68వ ర్యాంకుతో సత్తా చాటిన సాయి చైతన్య జాదవ్‌తోపాటు అగ్రబాగాన నిలిచిన వారందరికీ అభినందనలు అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు.