24-04-2025 01:16:01 AM
హనుమకొండ, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): కాకతీయ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో పరిశోధకురాలు చల్లా స్వప్నకు డాక్టరేట్ లభించింది. ఆసరా పథకం- గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో దాని అమలు అన్న అంశంపై చేసిన వివరణాత్మక పరిశోధనకు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్ తెలిపారు. కాకతీయ యూనివర్సిటీ కి చెందిన రాజనీతి శాస్త్ర విభాగం ప్రొఫెసర్ వి.రామచంద్రం గారి పర్యవేక్షణలో చల్లా స్వప్న పరిశోధన చేశారు. వరంగల్ నగరానికి చెందిన చల్లా స్వప్న తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, కళాశాలలో సివిక్స్ పిజిటిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టరేట్ సాధించిన చల్లా స్వప్నకు యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధ కులు, సహోద్యోగులు అభినందనలు తెలిపారు.