ఆచార్య జయశంకర్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తి
07-08-2026 02:17 AM
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
కొత్తగూడెం టౌన్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతపరమైన బలాన్ని అందించిన ఉద్యమ మేధావి, ప్రముఖ విద్యావేత్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత ్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, తెలంగాణ కోసం జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని అన్నారు. డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్య, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఇస్లావత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






