calender_icon.png 8 August, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో పనిచేస్తూ ఫలితాలు సాధించండి

08-08-2025 12:50:02 AM

  1. రాష్ర్ట ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి దాసరి ఒడ్డెన్న

నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ 

నిజామాబాద్ ఆగస్టు 7: (విజయ క్రాంతి) ః అధ్యాపకులు సమన్వయంతో పని చేస్తూ మంచి ఫలితాలను సాధించాలని రాష్ర్ట ఇంటర్ బోర్డు నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి శ్రీ దాసరి ఒడ్డెన్న ఆదేశించారు. ఆయన గురువారం ఉదయం నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్ విద్యా అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ కూడా ఆయన వెంట ఉన్నారు.

కళాశాల ప్రిన్సిపల్ శ్రీ బుద్దిరాజ్  అధ్యక్షతన  కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చేరిన పేద, బడుగు, బలహీన, మైనార్టీ విద్యార్థినిల అభ్యున్నతికి అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ర్ట ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చేరిన ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాల్సిందేనని  ఆన్నారు.

కళాశాల ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున యూనిట్ టెస్టు లు నిర్వహించి మార్కుల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించాలని అన్నారు. ప్రతిభలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారు చదువుకునే విధంగా ఆసక్తినీ కలిగించాలని సూచించారు. అధ్యాపకులందరూ రాష్ర్ట ఇంటర్ బోర్డు సూచించిన టైం టేబుల్ ప్రకారమే తరగతులు నిర్వహించాలని, అలాగే ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని ఆదేశించారు.

ఎంసెట్ జేఈఈ మెయిన్స్ లో ర్యాంకులు సాధించేందుకుగాను ఫిజిక్స్ వాళ  యాప్ ఆన్లున్ తరగతులను నిర్వహించి విద్యార్థులను చైతన్యవంతం చేయాలని అన్నారు. కళాశాలకు  హాజరు కాకుండ  ఆబ్సెంట్ అయిన వారి సమాచారం తల్లిదండ్రులకు సెల్ఫోన్ ద్వారా  మేసేజ్ సమాచారాన్ని అందజేసే ప్రక్రియ ప్రయోగాత్మకంగా నిజామాబాద్ నుంచి ప్రారంభించాలన్నారు.

కళాశాలలో జరుగుతున్న విద్యా బోధన గురించి రాష్ర్ట ఇంటర్ బోర్డు ప్రత్యేక అధికారి స్వయంగా విద్యార్థులను స్వయంగా అడిగి జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ తిరుమలపుడి రవికుమార్ మాట్లాడుతూ నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు  పెరగడం పట్ల అధ్యాపకులు, ప్రిన్సిపాల్ చేస్తున్న కృషిని అభినందించారు.

నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాల రాష్ర్టంలోనే మోడల్ జూనియర్ కళాశాలగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కళాశాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు.