calender_icon.png 26 January, 2026 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల హాస్టల్‌లో పేలిన ఏసీలు

26-01-2026 12:42:11 AM

తప్పిన ప్రమాదం

మేడ్చల్, జనవరి 25 (విజయ క్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఆల్వాల్ లో బాలికల హాస్టల్ లో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్థి నులు సురక్షితంగా బయటపడ్డారు. నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్ నాలుగు అంతస్తులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఏసీలు పేలిపో యి దట్టమైన పొగలు వ్యాపించాయి. విద్యార్థినులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. పొగ వల్ల కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంతో విద్యార్థులు తీవ్రభయాందోళనకు గురయ్యారు.