సనత్‌నగర్ సీఐపై చర్యలు తీసుకోవాలి
08-08-2026 12:00 AM
సీపీ సజ్జనార్‌కు వినతి
ముషీరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): సనత్నగర్ సీఐ డి. అశోక్ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఫతేనగర్కు చెందిన ప్రేమ్ చంద్ ఆస్తి వివాదంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆర్పీఐ (అథవాలే) జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర్ గౌడ్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. ప్రేమ్ చంద్ను తన ఆస్తిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పాటు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో సమగ్ర విచారణ జరిపించాలని, సీఐ డి. అశ్పో శాఖాపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని పేరం శివ నాగేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.






