03-01-2026 12:00:00 AM
ప్రత్యేక పూజలో పాల్గొన్న టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జయా గుణచైతన్య రెడ్డి
సంగారెడ్డి, జనవరి 2 (విజయక్రాంతి) : సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నూతన సంవత్సరం సందర్భంగా అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. వాసవి ఆలయ కమిటీ చైర్మెన్, టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జయా గుణ చైతన్య రెడ్డి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మల జగ్గారెడ్డి, గుణ చైతన్య రెడ్డి లను సత్కరించారు. కరణ్ గజేంద్ర స్వామి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన భజన కార్యక్రమం భక్తులను అలరించింది. వాసవి మాతా ఆలయానికి భూమిని ఇచ్చిన దాతలతో వివరాలతో కూడిన శిలాఫలకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. దాతలను సత్కరించారు.