13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రామాయంపేట నియోజకవర్గం కోసం కార్యాచరణ

27-03-2026 12:33 AM

ర్యాలీ, రౌండ్ టేబుల్ సమావేశం

రామాయంపేట, మార్చి 26 : అప్పట్లో ఉనికి కోల్పోయిన నియోజకవర్గం.. ఘన చరిత్ర ఉన్న రామా యంపేట అసెంబ్లీ చరిత్ర పుటల్లో తొలగింది. అయితే అదృష్టమా అని 2027లో తిరిగి డీ -లిమిటేషన్ జరగనుంది. ఈ నేపథ్యంలో పూర్వ వైభవం కోసం మరో ఉద్యమం ఆరంభమైంది. ఈసారి ఎలాగైనా రామాయంపేటను నియోజకవర్గంగా చూడాలంటూ శాంతియుత ఉద్యమం మొదలైంది. బుధ, గురువారాల్లో కార్యచరణ రూపొందించే పనిలో పడ్డారు.

గురువారం మొదట బిఆర్‌ఎస్ మెగా ర్యాలీ చేపట్టి తహసిల్ కార్యాలయంలో కొత్త నియోజకవర్గాల్లో రామాయంపేట చేర్చాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం అందజేసింది. అనంతరం ప్రతిపక్ష నేతలు రౌండ్ టేబుల్ సమావేశమై ఎంతటి త్యాగాలకైనా వెనకాడకుండా పోరాటాన్ని నెరపాలని తీర్మానించారు. అందరం ఐక్యంగా ఉండి పోరాట పటిమతో ముందుకు సాగాలని నిర్ణయించారు. దీనిలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి పలు బాధ్యతలు అప్పగించడం జరిగింది.