13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపనలో ఎమ్మెల్యే జీఎంఆర్

27-03-2026 12:34 AM

జిన్నారం/అమీన్పూర్, మార్చి 26: ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో దోహదపడతాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. గడ్డ పోతా రం మున్సిపల్ పరిధిలోని మాదా రం గ్రామంలో నూతనంగా నిర్మించిన 42 అడుగుల పంచముఖి హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎం ఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయం దేవాలయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పటాన్చెరు నియోజకవర్గంలోనే అతిపెద్ద పంచముఖి హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, గడ్డపోతారం మున్సిపల్ చైర్మన్ గద్దె సుష్మా గణేష్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాల్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, విగ్రహ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.