calender_icon.png 13 July, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోలివింగ్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలి

12-07-2025 11:27:05 PM

ఇబ్రహీంపట్నం ఏసిపి రాజుకు బీజేపీ, బీజేవైఎం నేతల ఫిర్యాదు..

ఇబ్రహీంపట్నం: విష సంస్కృతిని ప్రోత్సహించే కోలివింగ్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలనీ బీజేపీ, బీజేవైఎం నేతలు అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నం అసెంబ్లీ కన్వీనర్ వన్నవాడ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం ఏసిపి కెపివి రాజును కలిసి ఫిర్యాదు చేశారు. ఆదిభట్ల ఓ వైపు అభివృద్ధిలో దూసుకుపోతోంది. అయితే ఇక్కడ ఏర్పాటైన హాస్టల్స్ లో కొన్ని విష సంస్కృతిని ప్రోత్సహించేలా, ధనార్జనే ధ్యేయంగా కోలివింగ్ హాస్టల్ ను నడుపుతున్నారనీ, దీంతో ఆదిభట్ల, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలతో యువత చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి హాస్టల్స్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల మహేందర్, బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు గోదల శేఖర్ రెడ్, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆడెపు రాఘవేంద్ర, బీజేవైఎం ఆదిభట్ల అధ్యక్షులు వినయ్, యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బీరప్ప, బీజేవైఎం జిల్లా కార్యదర్శి విజయ్ రజక్, బీజేవైఎం జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.