12-07-2025 11:22:34 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నిమ్మల రమేష్ ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) పరామర్శించారు. ఇటీవల రమేష్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనను ఎమ్మెల్యే శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రమేష్ త్వరగా కోలుకోవాలని ఆయన కోరారు. ఆయన వెంట ఖానాపూర్ నాయకులు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.