10-05-2025 12:37:52 AM
- మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సిఐటియు నాయకులు
గజ్వేల్, మే 9 : మహిళా సంఘాలను మోసం చేసి లక్షల రూపాయలు కాజేసిన మెప్మా సీవో, ఆర్పీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య డిమాండ్ చేశారు.
శుక్రవారం గజ్వేల్ మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారులకు మహిళా సంఘాల సభ్యులతో కలిసి సిఐటియు నాయకులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ గజ్వేల్ పట్టణ మహిళా సంఘాలైన చైతన్య, లీల శ్రీ, సావిత్రిబాయి, శివశంకర్, నెహ్రూ, మానస తదితర గ్రూపులలో గ్రూప్ సభ్యులకు తెలియకుండా వాళ్ళ అకౌంట్లో నుండి డబ్బులు డ్రా చేసినట్టుగా గత నెల రో జుల నుండి గజ్వేల్ పట్నంలో చర్చ జరుగుతుందన్నారు.
అంతే కాకుండా గ్రూప్ సభ్యులు ఇప్పటికీ పలు దఫాలుగా స్థానిక మున్సిపల్ కమిషనర్, పోలీసులకు, మెప్మా పీడీకి, కలెక్టర్ కి, ప్రజా వాణి లో కూడా వినతి పత్రం అందించారు. కానీ ఇంతవరకు జిల్లాస్థాయి అధికారులు కానీ, స్థానిక అధికారులు కానీ పట్టించుకోవడం లేదన్నారు.
రోజువారి కూలి చేసుకొనే కూలీలు గ్రూ పులో ఉంటామని గ్రూప్ సభ్యులుగా జమ చేసి గ్రూపులో చేర్చుకొని వారికి తెలియకుండానే ఒక్కొక్క గ్రూపు నుండి రూ. 10 నుండి రూ. 20 లక్షల చొప్పున సుమారు కోటి రూపాయలకు పైగా వాడుకున్నట్టుగా తెలుస్తుందని ఆరోపించారు.
ఇప్పటికే ఆర్ పి కృష్ణ లీల స్వయంగా స్థానిక మున్సిపల్ కమిషనర్ కి రూ. 67 లక్షల రూపాయలు సి ఓ కు ఇచ్చారని రాతపూర్వకంగా వివరించిందన్నారు. తాము మోసపోయామని మహిళా సంఘాల గ్రూపుల సభ్యులు హనుమంత రెడ్డికి తమ బాధ వ్యక్తం చేసిన నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారన్నారు.
మెప్మా సిఓపై హారతి పై ఫిర్యా దు చేసి వారి పొట్ట కొట్టొద్దని వెల్లడించినట్లు సిఐటియు నాయకులు రమణాకర్ విలేకరులతో వెల్లడించారు. ఈ అవినీతిలో పిడి హనుమంత్ రెడ్డి భాగస్వామ్యం కూడా ఉన్నట్లు వారు ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్లు మెప్మాలో జరిగిన అవినీతి పై విచారణ జరిపి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.