calender_icon.png 10 May, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో 24కిలోల గంజాయి పట్టివేత

10-05-2025 12:39:41 AM

- నలుగురు అరెస్టు.. కారు, బైక్ స్వాధీనం

సంగారెడ్డి, మే 9(విజయక్రాంతి): వేర్వేరు ఘటనలో గంజాయిని విక్రయిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి సుమారు 24 కిలోల గంజా యిని సంగారెడ్డి జిల్లా ఎస్టీఎఫ్‌ఏ బృందం పట్టుకున్నారు. వివరాలు ఇలావున్నాయి... మహారాష్ట్ర జౌరంగబాద్లోని ఒక కంపెనీలో జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మద్ హుస్సెన్ అనే వ్య క్తి ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.

వస్తున్న జీ తం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడు. రెండేళ్లుగా ఉద్యోగంతో పా టు గంజాయి వ్యాపారం చేస్తున్నాడు. 20 23లో ఒకమారు గంజాయి రవాణ చేస్తూ అబుల్లాపూరమెట్లో పట్టుబడినట్లు తెలిపా రు. అయినా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మద్ హుస్సెన్ మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్టిఎఫ్‌ఏ టీమ్ ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇతను సీలేరు నుంచి  గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తూ ఉంటాడని తెలిపారు. లక్ష్మీ బాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయిని తీసుకొని జాతీయ రహదారి 65లో సంగారెడ్డి  పోతురెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్మెంట్ ప్రాంతంలో కారులో వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు.

ఈ కేసుల్లో గం జాయిని కొనుగోలు చేసి అమ్మకాల కోసం తీసుకు వెళ్తున్న జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమ ద్ హుస్సెన్, గంజాయి అమ్మకాలు జరిపిన లక్ష్మీబాయి, కృష్ణ అనే వ్యక్తులపై కేసు నమో దు చేశారు. కారు, గంజాయి, నిందితుడు జలీలోద్దీన్ సిద్దిఖి అహ్మమద్ హుస్సెన్ ను అరెస్టు చేసి సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు ఎస్టిఎఫ్‌ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 10 లక్షలుఉందనితెలిపారు.

మూడు కేసుల్లో 3.315 కేజీల గంజాయి పట్టివేత

సంగారెడ్డి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు నమోదు చే సి, 3.315 కేజీల గంజాయి ముగ్గురు వ్యక్తులను మూడు బైకులను స్వాధీనం చేసుకు న్నారు. 1.500 కేజీల గంజాయి కేసులో ఎస్‌ఆర్ నగర్ కు చెందిన సందీప్ ను అరెస్ట్ చేసి అతడి వద్ద స్కూటీని, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే బీరంకొండకు చెందిన సాయికుమార్, శ్రీకాంత్ ల వద్ద 1.200 కేజీ ల గంజాయిని పట్టుకొని వారి వద్ద నుండి బైకు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  మరో కేసులో 615 గ్రాములగంజాయిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్నటువంటి బైకును కూడా స్వాధీనం చేసుకున్నా రు. 

ఈ మూడు కేసుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి సంగారెడ్డి పోలీసులకు గంజాయితో పాటు అప్పగించారు. ఈ దాడుల్లో అధికారులు వీణారెడ్డి, గాంధీ, అనిల్, యాద య్య, ప్రహ్లాద్, కరీం, యాదయ్య, గోపాల్ రామారావు, ఉమా మల్కయ్య ఉన్నారు.

ఈ మేరకు సంగారెడ్డి ఎక్సైజ్ శాఖ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖా సీం, మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హరి కిషన్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సిబ్బంది నిఅభినందించారు.