26-05-2025 08:58:38 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో చలామణి అవుతున్న నకిలీ విలేకరులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం టియుడబ్ల్యుజే (ఐజేయు) ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila), డిపిఆర్ఓ విష్ణులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భూమయ్య మాట్లాడుతూ... జిల్లాలో సోషల్ మీడియా, వెబ్సైట్ ప్రకారం వార్తలను ప్రచురితం చేస్తూ నకిలీ విలేకరులు బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
స్పందించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల త్వరలోనే నకిలీ విలేఖర్లను గుర్తించి వారిపై కేసుల నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిపిఆర్ఓ విష్ణుకు నకిలీ విలేకరులపై చర్యల కొరకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుమ్ముల అశోక్, కోశాధికారి వాకులాభరణం ప్రశాంత్, జిల్లా సంయుక్త కార్యదర్శి జల్దా మనోజ్ కుమార్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్ శర్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్, సభ్యులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.