26-05-2025 09:06:03 PM
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్...
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి-2025 ఆర్ఓఆర్ చట్టం అమలులో సర్వేయర్ల పాత్ర కీలకమని, ప్రభుత్వం ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అన్నారు. జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించి సర్వే మెటీరియల్ కిట్లను అందజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే. వీరబ్రహ్మచారి, ఏడి ఎస్ఎల్ఆర్ నరసింహమూర్తి పాల్గొన్నారు.