28-01-2026 07:25:23 PM
దేవరకొండ,(విజయక్రాంతి): మున్సిపాలిటీ 5వ వార్డుకి చెందిన జక్కుల రాజేశ్వరి తో పాటు యాభై కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరినవాళ్ళకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి, సంక్షేమం కుంటునపడ్డాయన్నారు.
పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే వార్డు అభ్యర్థులకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించి మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ దేవరకొండ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ పాల్వాయి స్రవంతి, కేతావత్ బిల్యా నాయక్, నేనావత్ కిషన్ నాయక్,గాజుల ఆంజనేయులు,బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, వేముల రాజు,బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులిసిరం,విరమోని అంజి గౌడ్, కేతావత్ రమేష్, పల్లా లోహిత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.