16 July, 2026 | 8:25 AM

ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి

07-06-2024 01:55 AM

సిద్దిపేటరూరల్, జూన్ 6: జిల్లాలో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధం గా నిర్వహిస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్దన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కార్యాలయం లో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గురువారం అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ కళాశాల ల్లో  సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ల్యాబ్‌లు, కంప్యూటర్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ఫీజులను నియంత్రిం చాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు నరేశ్, ప్రసన్నకుమార్, శిరీష, సమ్మయ్య ఉన్నారు.