16 April, 2026 | 7:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

అక్రమంగా ఇంటి స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి

14-06-2025 01:00 AM

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): ఫోర్జరీ సంతకాలతో ఇంటి స్థలం కొనుగోలు చేసినట్టు గ్రామపంచాయతీ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై చట్టారీత్య చర్యలు తీసుకోవాలని  వెల్లంపల్లి ప్రవీణ్  జిల్లా కలెక్టర్ ను కోరినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో  విలేకరులతో మాట్లాడుతూ మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన అదే గ్రామంలో మాకు రెండు గంటల ఇంటి స్థలం ఉందన్నారు. ఉపాధి కోసం నల్లగొండలో ఉండడంతో శివన్న గూడెం మా ఇంటి పక్కన ఉన్న బేరే రాములు మేము ఇంటి స్థలం అమ్మినట్లు మా సంతకాలు ఫోర్జరీ చేసి సదా కాగితం మీద అగ్రిమెంట్ కాగితం రాసుకొని గ్రామపంచాయతీలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై గ్రామపంచాయతీ కార్యదర్శి ని సంప్రదిస్తే సరైన సమాధానం చెప్పకుండా దాటేస్తుందని ఆరోపించారు. ఉన్నత అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.